కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా : ఈటల రాజేందర్
ఎన్నికల హామీలను నిరూపిస్తే రాజకీయాల్లో నుండి శాశ్వతంగా తప్పుకుంటా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుండి తప్పుకుంటా అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మాసిటీకోసం 19వేల ఎకరాలు భూ సేకరణ చేసేందుకు ప్రయత్నించింది. ఫార్మాసిటీలను రద్దు చేస్తాని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చారు.
ఫోర్త్ సిటీకోసం 30వేల ఎకరాలు అంటున్నారు. ఫోర్త్ సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఫార్మా సిటీ రద్దు అన్నారు.. కొడంగల్‌లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. లగచర్లలో మా మీద దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెబుతున్నారు. అయినా, రైతులను నానా హింసలకు గురి చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్న వారిని గుర్తించి పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లగచర్ల రైతులు నక్సలైట్లా? వాళ్లేమైనా సంఘ విద్రోహ శక్తులా? నర్మదా, సబర్మతి నదుల్లాగే మూసీ అభివృద్ధి జరగాలి.. అందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మూసీ ఇరువైపులా ఇళ్లను కూల్చి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చిన హామీలు నెరుపుతున్నాయా? అనేది సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.