బిర్యానీలు, లిక్కర్ బాటిళ్లే కాదు.. వాటిలో కూడా హైదరాబాదీల రికార్డ్

మిగతా నగరాల్లో నమోదైన మొత్తం కేసులకంటే హైదరాబాద్ కేసులే ఎక్కువ. ఆ స్థాయిలో ఇక్కడ మందుబాబులు రోడ్లపై వీరంగం చేశారు. వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.

Advertisement
Update:2024-01-02 09:45 IST

నూతన సంవత్సర వేడుకల వేళ.. హైదరాబాదీలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. బిర్యానీలు ఆర్డర్ ఇవ్వడంలో మనవాళ్లే టాప్ అంటూ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. ఇక లిక్కర్ సేల్స్ లో కూడా హైదరాబాదీలే టాప్ అంటూ ప్రభుత్వ గణాంకాలు విడుదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కండోమ్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయనే హాట్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాదీలు మాత్రం మరో విషయంలో కూడా తమ స్పెషాలిటీ నిరూపించుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తమకు పోటీ ఎవరూ లేరని ప్రూవ్ చేసుకున్నారు.

డిసెంబర్ 31 రాత్రి..

ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 283

బెంగళూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 330

ఢిల్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 495

హైదరాబాద్ లో డిసెంబర్-31న నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,258

ఈ పోలిక చూస్తే హైదరాబాద్ ఏ ప్లేస్ లో ఉందో, మిగతా ప్రాంతాలకంటే ఎంత ముందుందో అర్థమవుతుంది. మిగతా నగరాల్లో నమోదైన మొత్తం కేసులకంటే హైదరాబాద్ కేసులే ఎక్కువ. ఆ స్థాయిలో ఇక్కడ మందుబాబులు రోడ్లపై వీరంగం చేశారు. వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. కొంతమంది బ్రీత్ అనలైజర్ టెస్ట్ లకు చిక్కగా, మరికొందరు పారిపోతూ బుక్కయ్యారు.

హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి మొత్తం 3,258 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ లో 1500 కేసులు నమోదు కావడం విశేషం. సైబరాబాద్‌ లో ఇద్దరు మహిళలు కూడా తప్పతాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. మొత్తం 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సైతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News