అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు?

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బైటికి వచ్చి మాట్లాడాలన్న మంత్రి కొండా సురేఖ

Advertisement
Update:2024-12-05 11:50 IST

బీఆర్‌ఎస్‌ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకొచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి అని ఒకరు అగౌరవంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యేకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బైటికి వచ్చి మాట్లాడాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా రేవంత్‌రెడ్డిని గతంలో చిన్న డ్రోన్‌ కేసులో కక్షపూరితంగా అరెస్టు చేశారని మంత్రి గుర్తు చేశారు. 

Tags:    
Advertisement

Similar News