ఏపీలో రేపు భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చారించింది
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ దిశగా కదలుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి తుఫాను కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది. నేడు నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
Advertisement