ఈయన మరో ఫేకూ... నడ్డా పై కేటీఆర్ ట్వీట్

ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి ఈ దేశ ప్రజలను రక్షించాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈయన మరో ఫేకూ అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

Advertisement
Update:2022-11-04 21:46 IST

బీజేపీ ని చీల్చి చెండాడటంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుంటారు. సభల్లోనైనా, ట్విట్టర్ లోనైనా బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టడం, తెలంగాణకు కేంద్ర‍ం చేస్తున్న అన్యాయాన్ని వివరించి చెప్పడం, దేసవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను విడమర్చడం, వాళ్ళు చేసే అబద్దపు ప్రచారాలను బహిర్గతం చేయడం ప్రతి క్షణం చేస్తూ ఉంటారు కేటీఆర్.

ఈ మధ్య వచ్చిన కరోనామహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ అద్భుతంగా పని చేశారని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నాయకులు అక్కడితో ఆగకుండా అసలు కరోనా వ్యాక్సిన్ లను మోడీ యే కనిపెట్టాడని ప్రచారం మొదలు పెట్టారు. కరోనా సమయంలో చనిపోయిన వేలాదిమందిని, గంగా నదిలో కొట్టుకొచ్చిన వందలాది శవాలను మర్చిపోయి. ఆక్సీజన్ దొరక్క మరణించినవారి గురించి చెప్పకుండా దాచిపెట్టి, వేలాది కిలోమీటర్లు నడిచిన వలసకూలీల విషయం, నడిచీ నడిచీ మరణించిన విషయం, అలసిపోయి పడుకున్న వలసకూలీలపై రైళ్ళు దూసుకెళ్ళిన విషయాన్ని కప్పి పెట్టి. ప్రధాని మోడీ కరోనా సమయంలో మనందరినీ కాపాడిన భ‌గవంతుడన్నట్తు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు.

మోడీ దైర్యం చేసి కరోనా వాక్సిన్ కనుగొన్నాడంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోడీ రష్యా - ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలు మనం మరవకముందే ఇప్పుడు నడ్డా వారికి తోడయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ...

''ప్రధాని మోడీ జీ మన కోసం 9 నెలల్లో 2 టీకాలు తయారు చేశారు, మీ అందరికీ డబుల్ డోస్, బూస్టర్ డోస్‌తో టీకాలు వేసి మిమ్మల్ని రక్షించారు. ఇప్పుడు మనం ఆయనను రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని కాపాడిన పార్టీని కాపాడుకోవడం మీ బాధ్యత'' అని మాట్లాడారు.

ఏఎన్ ఐ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వార్తను షేర్ చేసిన కేటీఆర్ మరొక ఫేకూ అని కామెంట్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజనులు బీజేపీ నాయకులపై సెటైర్లు వేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News