పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చుపై హరీశ్‌ రావు ఆగ్రహం

గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు

Advertisement
Update:2024-11-11 15:52 IST

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హటావో పిలుపునిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలన విధానాలపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మండిపడ్డారు. ఈరోజు ఆ రాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు ముఖ్యమంత్రి మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని తెలిపారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు.

ఫార్మా సిటీ కోసం నాడు మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్‌ ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని, ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని హరీష్ రావు ఆరోపించారు. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News