కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌.. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు

కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి అంటూ ఆ ఇద్దరు నాయకుల్ని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. వారిద్దరితో తెలంగాణ బతుకులు ఆగమైపోతాయన్నారు.

Advertisement
Update:2023-07-29 14:20 IST

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడివారే అధ్యక్షులు అయినా.. వారికి సూచనలు సలహాలు వచ్చేది మాత్రం ఏపీనుంచే అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబు చెప్పినట్టు చేసేవారని, ఇప్పుడు బీజేపీకి కూడా ఏపీనుంచే ఆదేశాలందుతున్నాయని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, ఆయన గురువు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వింటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు వ్యతిరేక పార్టీలని.. నల్ల చట్టాలతో వేలాదిమంది రైతుల చావుకి బీజేపీ కారణమైందని, మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రైతులకు మరణశాసనం రాయాలని చూస్తోందన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే అవకాశమే లేదన్నారు హరీష్ రావు.

సిద్దిపేట జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేశారు హరీష్ రావు. గజ్వేల్‌ లో కూడా పర్యటించారాయన. ప్రతిపక్ష పార్టీల నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అహర్నిశం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు.

కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి అంటూ ఆ ఇద్దరు నాయకుల్ని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. వారిద్దరితో తెలంగాణ బతుకులు ఆగమైపోతాయన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ముందు చూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News