మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు నివాళులు అర్పించిన హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్సీ, ఆర్.సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
Advertisement
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ భౌతికకాయనికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేహరీశ్ రావు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సత్యనారాయణ తన దైన ముద్ర వేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమన్నారు.స త్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు
Advertisement