కేసీఆర్ నిఖార్సయిన హిందువు -హరీష్ రావు
హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు అని అన్నారు మంత్రి హరీష్ రావు. రూ.1200 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశామని, 600 కోట్ల రూపాయలతో కొండగట్టు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారాయన. అర్చకులకు జీతాలపెంపు, ఆలయాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు హరీష్ రావు. తెలంగాణలో 10వేల దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం కోసం ఒక్కో ఆలయానికి ఇస్తున్న 6వేల రూపాయలను ఏకంగా 10వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని గుర్తు చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో రూ.40లక్షలతో రామాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు.
హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. ఆయన వెంట ఇతర నాయకులు ఉన్నారు. రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ కు ఉన్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు హరీష్ రావు. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక్క గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయన్నారు. ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డామని, ఈరోజు రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ ఎదిగామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చింది కేసీఆరేనని అన్నారు హరీష్ రావు.
హ్యాట్రిక్ సీఎం..
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు మంత్రి హరీష్ రావు. కేసీఆరే మరోసారి తమకు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. ఆ అభివృద్ధితోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని తమ గుండెల్లో నిలుపుకున్నారని చెప్పారు హరీష్.