అశోక్ నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థి ఆత్మహత్య
హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖ ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం కూడా నిశ్చయమైంది. కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకోగా గాంధీ ఆస్పత్రిలో ఈరోజు పోస్ట్ మార్టం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు సురేఖ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
ఆసుపత్రి వద్దకు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ నాయకులు సురేఖ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆశోక్ నగర్ కు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సురేఖ సూసైడ్‌పై నిజాలను పోలీసులు వెల్లడించాలని, సూసైడ్ నోట్ బయటపెట్టాని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడకుండా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వంటి సమస్యల సాకులు చెప్పకుండా జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్ధని కోరారు.