ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

ఇందల్వాయి వద్ద గజమాలతో వెల్‌ కమ్‌ చెప్పిన పార్టీ శ్రేణులు

Advertisement
Update:2024-12-29 12:02 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌ పై బయటికి వచ్చిన తర్వాత మొదటిసారి కవిత నిజామాబాద్‌ జిల్లాకు ఆదివారం వచ్చారు. ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద పార్టీ పార్లమెంటరీ నాయకుడు కేఆర్ సురేశ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు భారీ గజమాలతో వెల్‌ కమ్‌ చెప్పారు. భారీ క్యాన్వాయ్‌ తో ఇందల్వాయి టోల్‌ ప్లాజా నుంచి డిచ్‌పల్లికి చేరుకున్న కవితకు అక్కడ పార్టీ నాయకులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా కవిత నిజామాబాద్‌ లోని సుభాష్‌ నగర్‌ లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ విఠల్‌ రావు, బాజిరెడ్డి జీవన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




 


Tags:    
Advertisement

Similar News