హైడ్రాపై గవర్నర్ కీలక నిర్ణయం

హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది.హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు

Advertisement
Update:2024-10-05 16:24 IST

హైడ్రాకు సర్వ అధికారాలు వచ్చాయి. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. తాజగా అందుకే సంబంధించిన గెజిట్ విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లను, కట్టడాలను నేలమట్టం చేశారు.

అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుండగా.. కోర్టులు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది. హైడ్రాకు చట్టబద్దత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో సర్కార్ దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డీనెన్స్ తీసుకోచ్చింది

Tags:    
Advertisement

Similar News