ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు రవాణాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటన;

Advertisement
Update:2025-03-07 10:53 IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు రవాణాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనున్నది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇప్పటివరకు 150 కోట్ల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు పెరగడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగినా నిరంతరం శ్రమిస్తున్నారంటూ అభినందించారు. మరోవైపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్‌ మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నది. మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు కొనిపించి ఆర్టీసీకి కిరాయి ఇవ్వనున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు తొలివిడత ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం ప్రారంభించనున్నారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మొదలుపెట్టనున్నారు.

Tags:    
Advertisement

Similar News