కొత్త కంపెనీలు సంగతి దేవుడెరుగు... ఉన్న కంపెనీలు పోకుండా చూడండి : కేటీఆర్

రాష్ట్రంలో కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు... ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని మాజీ మంత్రి అన్నారు.

Advertisement
Update:2025-01-24 16:28 IST

తెలంగాణ రాష్ట్రంలో నూతన కంపెనీల సంగతి దేవుడెరుగు... ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ కట్' అని సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. ఈ కథనం ప్రకారం... ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ లేకపోవడంతో మూడ్రోజులుగా సేవలు నిలిచిపోయాయని, దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉద్యోగులను అధికారులు ఆదేశించారు.

దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం రాగానే... చక్కగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని పేర్కొన్నారు. కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయని... ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కేటీఆర్ ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News