అమ్మాయిలకు ఈ ప్రపంచాన్ని పాలించే సత్తా ఉంది : కేటీఆర్
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అమ్మాయిలపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
జాతీయ బాలికా దినోత్సవం సందర్బంగా అమ్మాయిలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి అని ట్వీట్టర్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ధైర్యవంతులైన, తెలివైన అమ్మాయిలు.. మీరే భవిష్యత్.. ప్రకాశిస్తూ, కష్టపడుతూ, ప్రపంచాన్ని మారుస్తూ ఉండండి అని కేటీఆర్ సూచించారు.
జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా, మీ అందరితో ఒక రహస్యాన్ని పంచుకుంటాను.. ఈ ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. పెద్ద కలలు కలిగిన చిన్నారులు మీరే అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పాలించండి.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించినా విశ్రమించకండి.. మీరు కచ్చితంగా ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, అద్భుతమైన ప్రదేశంగా మార్చుతారు అని కేటీఆర్ కొనియాడారు.