బీఆర్ఎస్ ఫుల్ లిస్ట్.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..
రిజర్వ్ స్థానాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు కేసీఆర్. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకు సమానంగా సీట్లు ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే 16స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్ తాజాగా హైదరాబాద్ స్థానానికి కూడా అభ్యర్థిని అనౌన్స్ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దింపారు. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది.
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు కేసీఆర్ అవకాశం కల్పించారు. బీసీలకు 6 పార్లమెంట్ స్థానాలిచ్చారు. బీసీల్లోనూ మున్నూరు కాపులకు రెండు (జహీరాబాద్, నిజామాబాద్) పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్‌లకు, సికింద్రాబాద్‌ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి, హైదరాబాద్ స్థానాలను యాదవులకు ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. వెలమ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో సీటు దక్కింది.
రిజర్వ్ స్థానాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు కేసీఆర్. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకు సమానంగా సీట్లు ఇచ్చారు. ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీ (గోండు) గిరిజనులకు కేటాయించగా, మహబూబాబాద్ స్థానాన్ని మైదాన ప్రాంత గిరిజన (బంజారా/లంబాడా) గిరిజనులకు కేటాయించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మాదిగ (నాగర్‌కర్నూల్, వరంగల్)లకు, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే..
1. నాగర్‌కర్నూల్(ఎస్సీ)- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
2. పెద్దపల్లి(ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్
3. వరంగల్(ఎస్సీ)- కడియం కావ్య
4. మహబూబాబాద్(ఎస్టీ) - మాలోత్ కవిత
5. ఆదిలాబాద్(ఎస్టీ)- ఆత్రం సక్కు
6. మెదక్ - పి. వెంకట్రామిరెడ్డి
7. మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
8. కరీంనగర్- బోయిన్‌పల్లి వినోద్ కుమార్
9. జహీరాబాద్- గాలి అనిల్ కుమార్
10. ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు
11. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
12. మల్కాజ్‌గిరి- రాగిడి లక్ష్మారెడ్డి
13. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
14. భువనగిరి- క్యామా మల్లేష్ యాదవ్
15. నల్గొండ- కంచర్ల కృష్ణారెడ్డి
16. సికింద్రాబాద్- తీగుళ్ల పద్మారావుగౌడ్
17. హైదరాబాద్- గడ్డం శ్రీనివాస్ యాదవ్