సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్‌రెడ్డి వైఖరీ వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Advertisement
Update:2024-10-09 20:13 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరీ వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటు నోటుకు కేసులో డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ ఈ రోజూ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివిదయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృ ద్రోహి రేవంత్ కు ఈ మట్టి బిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయి హారీశ్‌రావు ప్రశ్నించారు. 2014 లో అధికారం ఇస్తే తెలంగాణ వాడిని అమ్మేసే వాడివి మాజీ సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది.. కనుకే నువ్వు సీఎం కాగలిగావు నీకు సీఎం అనే ఉద్యోగం కూడా కేసీఆర్ చలవే అని గుర్తు పెట్టుకో మాజీ మంత్రి అన్నారు.

నువ్వు ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తు పెట్టుకో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్ఎస్. ఈయన చేసిన పనేందంటే వంట అయినంక గంటె తిప్పిండు గంతే అని ఆయన అన్నారు. 7,094 స్టాఫ్ నర్సుల నియామకాల దగ్గర ఇదే అబద్ధం.రేవంత్ నియామక పత్రాలు ఇచ్చిన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకైనా, సింగరేణిలో ఇచ్చిన ఉద్యోగాలకైనా, పోలీసు ఉద్యోగాలకైనా, టీచర్ల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్సే. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామకపత్రాలు ఇవ్వడం కుదురుతుందా? 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8792 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 11వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 12వేల నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ శాంక్షన్ ఇచ్చామని హారీశ్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News