వికారాబాద్ గడ్డి మైదానంలో వ్యాపించిన మంటలు, వృక్ష-జంతుజాలానికి ముప్పు

ఈ గడ్డి భూములు 191 పక్షి జాతులకు నిలయంగా ఉన్నాయి, వీటిలో అనేక వలసపక్షులు కూడా ఉన్నాయి. అరుదైన హాక్స్-పల్లీడ్ హారియర్, మార్ష్ హారియర్ పక్షులు రష్యా, తూర్పు ఆసియా దేశాల నుండి యెనకతల‌కు ప్రతి శీతాకాలంలో 5,000 కి.మీలకు పైగా ప్రయాణించి వలస వస్తాయి. ఇక్కడ పక్షులు మాత్రమే కాదు, అరుదైన భారతీయ బూడిద రంగు తోడేళ్ళు, అనేక నక్కలు కూడా ఉన్నాయి.

Advertisement
Update:2023-01-09 20:03 IST

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం యెనకతల గ్రామ సమీపంలోని యెన‌కతల గడ్డి మైదానం తెలంగాణలోని ప్రముఖ గడ్డి మైదానంలో ఒకటి. ఈ గడ్డి మైదానంలో కొందరు దుండగులు నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీ విస్తీర్ణంలో గడ్డి బూడిదైంది. సోమవారం కూడా మంటలు చెలరేగుతూ వృక్ష, జంతుజాలానికి ముప్పు వాటిల్లుతోంది.

ఈ గడ్డి భూములు 191 పక్షి జాతులకు నిలయంగా ఉన్నాయి, వీటిలో అనేక వలసపక్షులు కూడా ఉన్నాయి. అరుదైన హాక్స్-పల్లీడ్ హారియర్, మార్ష్ హారియర్ పక్షులు రష్యా, తూర్పు ఆసియా దేశాల నుండి యెనకతల‌కు ప్రతి శీతాకాలంలో 5,000 కి.మీలకు పైగా ప్రయాణించి వలస వస్తాయి. ఇక్కడ పక్షులు మాత్రమే కాదు, అరుదైన భారతీయ బూడిద రంగు తోడేళ్ళు, అనేక నక్కలు కూడా ఉన్నాయి.

యెన‌కతలకు వెళ్ళి అక్కడి పరిస్థితిని పరిశీలించిన హైదరాబాద్‌కు చెందిన అనుభవజ్ఞుడైన, ప్రముఖ పక్షి శాస్త్రవేత్త శ్రీరంగం హరిగోపాల్ మాట్లాడుతూ, వారాంతపు పక్షుల విహారయాత్ర కోసం పక్షుల ప్రేమికుల బృందం ఆదివారం యెన‌కతల పర్యటనకు వెళ్ళామని, అయితే మంటలతో ఆవరించిన పచ్చికభూమిని చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. హరిగోపాల్ తన తోటి వారితో కలిసి చెట్ల కొమ్మలను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని, అయితే తమ ప్రయత్నాలు సఫలం కాలేదని చెప్పారు. ఇప్పటికీ గడ్డి మైదానం అంతా మంటలు వ్యాపిస్తున్నాయని, జంతువులు పారిపోవడాన్ని తాము చూశామని ఆయన‌ చెప్పారు.

వృక్షజాలం, జంతుజాలానికి యెన‌కతల చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి తమ సిబ్బందిని మోహరించి మంటలను ఆర్పాలని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్‌బిపి) సభ్యుడు శ్రీరామ్ రెడ్డి అటవీ శాఖను కోరారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అరుదైన పక్షి జాతులు యెనకతలకు వస్తాయి కాబట్టి వాటిని రక్షించాలని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News