పంచాయతీ పర్మిషన్‌ తో ఫామ్‌ హౌస్‌ కట్టిన

నా ఫామ్‌ హౌస్‌ నిబంధనల ప్రకారమే ఉన్నది : మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి

Advertisement
Update:2024-10-04 15:11 IST

గ్రామ పంచాయతీ పర్మిషన్‌ తోనే తన ఫామ్‌ హౌస్‌ నిర్మించానని మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం సెక్రటేరియట్‌ మీడియా పాయింట్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఫామ్‌ హౌస్‌ పై కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. తన ఫామ్‌ హౌస్‌ అక్రమమం అయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని తెలిపారు. 20 ఏండ్ల కిందనే ఫామ్‌ హౌస్‌ కట్టానని.. ఆరోపణలు చేస్తున్న వారి దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఆధారాలతో వస్తే అందరం కలిసి కూల్చేద్దామన్నారు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ లో తన ఫామ్‌ హౌస్‌ లేనే లేదని, అన్ని నిబంధనలు చూసుకున్న తర్వాతే తాము నిర్మాణం చేపట్టామన్నారు. తన ఫామ్‌ హౌస్‌ ను సర్వే చేయించానని, తనకు అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నిబంధనల ప్రకారమే ఉందా లేదా అనేది తనకు తెలియదన్నారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డిల ఫామ్‌ హౌస్‌ లు పక్కపక్కనే ఉన్నాయని, అవి అక్రమమా.. సక్రమమా అనేది కూడా తెలియదన్నారు. గ్రామ పంచాయతీ పర్మిషన్‌లు చెల్లవు అంటే ఆ నిబంధనలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయన్నారు.

Tags:    
Advertisement

Similar News