కాంగ్రెస్‌లోకి వివేక్.. ఆ స్థానం నుంచే పోటీ.!
వివేక్‌తో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని వివేక్ వెంకటస్వామి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వివేక్‌తో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి లోక్‌సభ టికెట్.. ఆయన కొడుకు గడ్డం వంశీకి చెన్నూరు టికెట్ కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు వివేక్ వెంకటస్వామి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
ఇప్పటికే బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ లాంటి నేతలు రాజీనామా చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు జహీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్..రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇక ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నుంచి బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నేతల వరుస రాజీనామాలతో బీజేపీ డీలా పడుతోంది.