బోన‌మెత్తితే 300.. చిందేస్తే బీరు సీసాలు.. ఎన్నిక‌ల సంద‌డి షురూ!

మ‌న నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి వ‌స్తున్నాడు ప్ర‌జ‌లంద‌రూ రండంటూ ఊరూరా ప్ర‌చారం చేసి మ‌రీ వెళుతున్నారు. నాగ‌ర్‌క‌ర్నూలు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బీఆర్ఎస్‌ నుంచి మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డికి టికెట్ ప్ర‌క‌టించేశారు.

Advertisement
Update:2023-09-01 13:10 IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇంకా రానే లేదు. అయినా అధికార బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని స్థానాల‌కు టికెట్లు ప్ర‌క‌టించి రాష్ట్రంలో ఎన్నిక‌ల కాక రేపింది. అంద‌రికంటే ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి అడ్వాంటేజ్ సృష్టించుకుంది. అభ్య‌ర్థులు కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీల కంటే ముందే ఓట‌ర్ల‌ను మంచి చేసుకోవాల‌ని ఊరూరూ తిరుగుడు షురూ చేసిన్రు. ఇంకేముంది జ‌నానికి సంద‌డానాయె. కార్య‌క‌ర్త‌ల‌కు హుషారానాయె.. మందుబాబుల‌కైతే పండ‌గేనాయె

డ‌ప్పేసి మ‌రీ చెబుతున్రు

మ‌న నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి వ‌స్తున్నాడు ప్ర‌జ‌లంద‌రూ రండంటూ ఊరూరా ప్ర‌చారం చేసి మ‌రీ వెళుతున్నారు. నాగ‌ర్‌క‌ర్నూలు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బీఆర్ఎస్‌ నుంచి మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డికి టికెట్ ప్ర‌క‌టించేశారు. దీంతో ఆయ‌న ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు. ఆయ‌న రాక‌కు ముందు ప‌ల్లెల్లో చాటింపు వేస్తున్నారు. జ‌నార్ద‌న్‌రెడ్డి అన్న మ‌న ఊరికి ప్ర‌చారానికి వ‌స్తున్న‌రు.. ఆయ‌న‌కు బోనంతో ఎదురొస్తే 300, బ‌తుక‌మ్మ‌ను చేసుకుని వ‌స్తే 300 అని మ‌హిళ‌ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించేస్తున్నారు. ఇంకేం మ‌ల్ల ఎక్క‌డికెళ్లినా బోనాలు, బ‌తుక‌మ్మ‌లు పక్కా అన్న‌ట్లు అని కామెంట్లు వినిపిస్తున్నాయి

పోర‌గాళ్ల‌కు హుషారే

ఇక జ‌నార్ద‌న్‌రెడ్డి అన్న ఊరేగింపులో డ్యాన్సు వేసే వాళ్ల‌కు కూడా ఓ క్రేజీ ఆఫ‌రు ఉంది. డ్యాన్సు వేసేవాళ్ల‌కు ఓ బీర్ సీసా ఇస్తారట‌. ఇంకేముంది మ‌రి జోష్‌కు జోష్‌.. తాగ‌నీకి బీరు.. యూత్ కూడా సై అంటారు. ఇది ఇవాళ జ‌నార్ధ‌న్‌రెడ్డి స్టార్ట్ చేశారు. ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చే కొద్దీ ఇంకెన్ని చిత్రాలు చూస్తామో..!

Tags:    
Advertisement

Similar News