రేవంత్ సర్కార్‌కు ఈసీ షాక్.. రైతు భరోసాకు బ్రేక్
సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఈనెల 9లోపు రైతు భరోసా విడుదల చేస్తామని రేవంత్ చెప్పడాన్ని ఈసీ తప్పు పట్టింది.
రేవంత్ సర్కార్‌కు షాకిచ్చింది ఎన్నికల కమిషన్. రైతు భరోసా నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఎన్. వేణు కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ స్పందించింది.
ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఈనెల 9లోపు రైతు భరోసా విడుదల చేస్తామని రేవంత్ చెప్పడాన్ని ఈసీ తప్పు పట్టింది. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈనెల 9లోపు రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తే.. కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఛాలెంజ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇప్పటివరకూ 5 ఎకరాల లోపు రైతులకు రైతుభరోసా నిధులు పంపిణీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. తాజాగా 5 ఎకరాల పైబడి భూమి ఉన్న రైతుల కోసం సోమవారం రూ.2 వేల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా రైతుభరోసా పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది.