తెలంగాణలో హాఫ్‌ డే స్కూల్స్‌.. షెడ్యూల్ ఇదే.!

ఈ విద్యా సంవత్సరంలో ఆఖరు పనిదినం ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బ‌డులు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.

Advertisement
Update:2024-03-07 15:58 IST

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది విద్యాశాఖ. హాఫ్‌ డే స్కూల్స్‌పై ప్రకటన చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్క్యూలర్ జారీ చేసింది.

మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూల్స్ ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొంది తెలంగాణ విద్యా శాఖ. ఈ విద్యా సంవత్సరంలో ఆఖరు పనిదినం ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బ‌డులు కొనసాగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే స్కూల్స్‌లో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. పదో తరగతి ఎగ్జామ్స్‌ ముగిసిన తర్వాత మళ్లీ యధావిధిగా ఉదయం పూట తరగతులు కొనసాగుతాయి.




 


Tags:    
Advertisement

Similar News