తెలంగాణలో 32 లక్షల ఓట్ల తొలగింపు.. కొత్త ఓటర్లు ఎంతమందో తెలుసా..?

ఇంటి నుంచి ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, వయో వృద్ధులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి 8 లోగా వారి ఓటు నమోదు చేస్తారని చెప్పారు వికాస్ రాజ్.

Advertisement
Update:2024-04-19 08:58 IST

ఎన్నికల ప్రక్రియలో భాగంగా గడిచిన రెండేళ్లలో తెలంగాణలో దాదాపు 32 లక్షలకుపైగా ఓట్లు తొలగించినట్లు స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. అదే సమయంలో 60 లక్షల కొత్త ఓటర్లను జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేశారు తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్.

30 లక్షల మంది ఓటర్లు తమ డేటాలో మార్పులు చేసుకున్నారని చెప్పారు వికాస్ రాజ్. ప్రస్తుతం రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 9 లక్షలుగా ఉందన్నారు. వయో వృద్ధులు లక్షా 93 వేల మంది ఉన్నారని, 5 లక్షల 27 మంది దివ్యాంగ ఓటర్లున్నారని స్పష్టం చేశారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 3 కోట్ల 31 లక్షల 48 వేల 527 మంది ఓటర్లు నమోదయ్యారని స్పష్టం చేశారు.

ఇక ఇంటి నుంచి ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, వయో వృద్ధులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి 8 లోగా వారి ఓటు నమోదు చేస్తారని చెప్పారు వికాస్ రాజ్.

Tags:    
Advertisement

Similar News