అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

అవినాశ్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలం కాకుండా సీబీఐ తానిష్టమొచ్చినట్టు రాసుకుంటోందని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు వివరించగా, తాము విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరపు లాయర్ తెలిపారు.

Advertisement
Update:2023-03-10 18:34 IST

వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ సోమవారం వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐ ని ఆదేశించింది. తనపై సీబీఐ తీవ్ర చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయవద్దంటూ తీర్పునిచ్చింది. సొమవారం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోర్టు సీబీఐ ని ఆదేశించింది.

అవినాశ్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలం కాకుండా సీబీఐ తానిష్టమొచ్చినట్టు రాసుకుంటోందని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు వివరించగా, తాము విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరపు లాయర్ తెలిపారు. అయితే వీడియో రికార్డింగ్ కు సంబంధించి పూర్తి వివరాలివ్వాలని కోర్టు సీబీఐ ని ఆదేశించింది. 

Tags:    
Advertisement

Similar News