ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే.. డీకే అరుణ మాటలు నమ్మొచ్చా..?

నేను పార్టీ మారను అనడం ఒక లెక్క, నేను జన్మలో పార్టీ మారను, చివరి ఊపిరి వరకు ఇక్కడే ఉంటా, తుది శ్వాస కూడా ఈ పార్టీలోనే తీసుకుంటానంటూ.. కాస్త అతిశయోక్తిగా చెబితే అనుమానించాల్సిందే. అందుకే డీకే అరుణ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Advertisement
Update:2023-11-05 12:29 IST

ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే.. డీకే అరుణ మాటలు నమ్మొచ్చా..?

ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ తెలంగాణలో వలసలు కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి కీలక నేతలు వచ్చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి రాకతో మరింత మంది వారి బాటలో పయనిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు మాజీ మంత్రి డీకే అరుణ. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు. ఆమె పార్టీ మారుతున్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు.

ఇలా చెబితేనే అనుమానం ఎక్కువ..

నేను పార్టీ మారను అనడం ఒక లెక్క, నేను జన్మలో పార్టీ మారను, చివరి ఊపిరి వరకు ఇక్కడే ఉంటా, తుది శ్వాస కూడా ఈ పార్టీలోనే తీసుకుంటానంటూ.. కాస్త అతిశయోక్తిగా చెబితే అనుమానించాల్సిందే. ఇటీవల పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి కూడా ఇంతకంటే ఎక్కువగా చెప్పినవారే. సీన్ కట్ చేస్తే వెంటనే కండువా మార్చి డైలాగులు కూడా మార్చేశారు. అందుకే డీకే అరుణ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అసెంబ్లీ బరిలో డీకే అరుణ లేకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతయినా డీకే అరుణ పార్టీ మారతారని అంటున్నారు. బీజేపీ నుండి వలసలు కొసాసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారు న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించారు. పార్టీ మారడంలేదు అని ఒక్క మాటలో తేల్చేసే సందర్భంలో.. ఆమె నుంచి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు రావడం విశేషం. అందులోనూ ఇటీవలే పార్టీ మారిన వారు కూడా ఇంతకంటే ఎక్కువగా లాయల్టీ కబుర్లు చెప్పేసరికి డీకే అరుణ వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. 

Tags:    
Advertisement

Similar News