ఫార్మా రంగంలో ఐటీ విప్లవం.. టీ హబ్ లో కేటీఆర్ సమావేశం

తెలంగాణలో ఫార్మాసుటికల్ రంగ అభివృద్ధి.. ఔషధాల తయారీ నుంచి చికిత్సా విధానాల్లో వచ్చిన మార్పులు, వాటిలో సాంకేతిక ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంపై చర్చ జరిగింది.

Advertisement
Update:2023-07-25 19:22 IST

ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తు.. ఫార్మాలో ఐటీ సానుకూలతల గురించి టీ హబ్ లో అర్థవంతమైన చర్చ జరిగింది. GSK సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టీహబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి గురించి చర్చించారు.


తెలంగాణలో ఫార్మాసుటికల్ రంగ అభివృద్ధి.. ఔషధాల తయారీ నుంచి చికిత్సా విధానాల్లో వచ్చిన మార్పులు, వాటిలో సాంకేతిక ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంపై చర్చ జరిగింది. సాంకేతికతను ఉపయోగించి ఔషధాల తయారీలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకు రావొచ్చనే విషయంపై కూడా GSK ప్రతినిధులు చర్చించారు.

ముఖ్యంగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి గురించి తెలుసుకోడానికి GSK ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. సినర్జీతో మరింత పురోగతి సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తోపాటు.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడులు, ప్రచారం, ఎన్నారై వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్, టీహబ్ సీఈవోలు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News