బాధ్యతలు స్వీకరించిన డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌

బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Advertisement
Update:2024-11-06 19:55 IST

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ బూసాని వెంకటేశ్వర రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య భవన్‌ లో గల నాలుగో ఫ్లోర్‌ లోని ఆఫీస్‌ లో వెంకటేశ్వర రావు చార్జ్‌ తీసుకున్నారు. ఆయనతో పాటు కమిషన్‌ మెంబర్‌ గా బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో బీసీల జనాభా, ఓటర్లలో బీసీల శాతం, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల పెంపుపై నెల రోజుల్లోగా కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా, అది చట్టబద్ధం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు ఆదేశాలతో డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. బుధవారమే సమగ్ర కుల గణన ప్రారంభమైంది. ఈనెలాఖరుకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి సర్వే పూర్తి చేసి ఆ వివరాలను ఎప్పటికప్పుడు అప్ లోడ్‌ చేయనుంది. ఈ సర్వే వివరాల ఆధారంగా రాష్ట్ర జనాభాలో బీసీల శాతం తేల్చి దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక ఇవ్వనుంది.

Tags:    
Advertisement

Similar News