రెండు నెలలు.. సీపీ కొత్తకోట టార్గెట్ అదే..!
రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నారు. సిటీలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ICCC బిల్డింగ్ ఆడిటోరియంలో సిటీలో పోలిసింగ్, ఎంక్వైరీ, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ కంట్రోల్‌కు సంబంధించి అన్ని జోనల్ డీసీపీలు, ACPలు, ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నారు. సిటీలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పబ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమయానికి మించి పబ్‌లు నడిపితే చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పైరవీలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు సీపీ.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. దీంతో అధికారులు ఆ దిశలో చర్యలు వేగవంతం చేశారు.