తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్‌తో ఒప్పందం.!
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కంపెనీ కార్యకలాపాల విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ.934 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కార్నింగ్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణలో సెల్‌ఫోన్లకు సంబంధించిన గొరిల్లా గ్లాస్ తయారీ పరిశ్రమ పెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పరిశ్రమ వల్ల 800 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్. మెటీరియల్ సైన్సెస్‌లో అగ్రగామిగా ఉన్న కార్నింగ్.. ఇండియాలోనే మొదటి సారిగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కంపెనీ కార్యకలాపాల విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పెంపుడు జంతుపులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా పేరుగాంచిన మార్స్ గ్రూప్ రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో రూ.200 కోట్లతో పెంపుడు జంతువుల ఆహార తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత 2021 డిసెంబర్‌లో మరో రూ.500 కోట్లు పెట్టుబడితో సంస్థ కార్యకలాపాలు విస్తరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఉత్పత్తులకు మంచి స్పందన రావడం, తెలంగాణలో స్నేహ పూర్వక వాతావరణం ఉండటంతో మరో రూ.500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పింది మార్స్ గ్రూప్.
వీటితో పాటు కూల్‌డ్రింక్స్ తయారీ సంస్థ కోకాకోలా సైతం.. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ఆ సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్మేక్ గ్రివి.. తెలంగాణలో విస్తరణకు ఆసక్తి చూపారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ప్లాంట్ పనులు కొనసాగుతుండగా.. వరంగల్, కరీంనగర్ మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
*