రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రైతులకు రైతుబంధు ఎగ్గోట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
పరిశ్రమల కోసం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరించిందని, వాటిని వాడుకుంటే సరిపోతుందని.. ఇపుడు కొత్తగా భూములు సేకరించాల్సిన పని లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ చర్యల వలన మహబూబ్‌నగర్ జిల్లా పచ్చగా మారిందని.. దానిని మళ్ళీ వలసల జిల్లాగా మార్చవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రైతులకు రైతుబంధు ఎగ్గోట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగవేయడానికి రైతు బోనస్ పేరిట అబడ్డలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఎన్కౌంటర్లు లేవు.. రేవంత్ రెడ్డి.. అమిత్ షాతో కలిసి రాష్ట్రంలో ఎన్కౌంటర్లకు తెరలేపారని అన్నారు. రూ.7,500 కోట్ల రైతు బంధు ఇవ్వలేక చేతులెత్తేశారు. వారికి రూ.30వేల కోట్ల బోనస్ ఎలా ఇస్తారు..? రైతు బంధు ఎగవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఎంత మందికి బోనస్ ఇచ్చారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.