కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది.. 55 సీట్లు ఫైనల్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన జాబితాను ముందుగా మీడియాకు విడుదల చేశారు. అధికారికంగా ఈరోజు గాంధీ భవన్ లో ప్రకటన ఉంటుందని చెప్పినా.. అంతకు ముందే లిస్ట్ బయటకు రావడం విశేషం.

Advertisement
Update:2023-10-15 09:24 IST

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది.. 55 సీట్లు ఫైనల్

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అయితే లిస్ట్ కేవలం 55 నియోజకవర్గాలకే పరిమితం అయింది. 55 మంది పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన జాబితాను ముందుగా మీడియాకు విడుదల చేశారు. అధికారికంగా ఈరోజు గాంధీ భవన్ లో ప్రకటన ఉంటుందని చెప్పినా.. అంతకు ముందే లిస్ట్ బయటకు రావడం విశేషం.






  

తొలి జాబితా సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఇప్పటికే 4 సార్లు భేటీ అయింది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ వచ్చిందని అంటున్నా.. అందులో 15 సీట్లను మాత్రం పక్కనపెట్టడం విశేషం. 55 మందితోనే తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్. మైనంపల్లి కుటుంబానికి రెండు సీట్లు ఈ ఫస్ట్ లిస్ట్ లోనే ఉండటం విశేషం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కూడా రెండు టికెట్లు తొలి జాబితాలోనే ఉన్నాయి.

తొలి జాబితాలో రేవంత్ రెడ్డి(కొడంగల్), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(నల్గొండ), ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్), గడ్డం వినోద్ (బెల్లంపల్లి), టి.జీవన్ రెడ్డి (జగిత్యాల), శ్రీధర్ బాబు(మంథని), దామోదర్ రాజనర్సింహ (ఆందోల్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), అంజన్ కుమార్ యాదవ్(ముషీరాబాద్), జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), భట్టి విక్రమార్క(మధిర), సీతక్క(ములుగు).. పేర్లతోపాటు ఇతర నియోజకవర్గాలను కూడా ఫైనల్ చేశారు.

అసంతృప్తులను బుజ్జగించే విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం మొహమాటాలకు పోదు అని ఇటీవల పొన్నాల లక్ష్మయ్య రాజీనామా విషయంలో తేలిపోయింది. తొలి లిస్ట్ తర్వాత కాంగ్రెస్ నేతలు ఎవరెవరు బయటకొస్తారో, ఎలాంటి స్పందనలు ఉంటాయో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News