బీఆర్ఎస్‌లో పెండింగ్ టికెట్లపై వీడిన సందిగ్ధత
నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్ఫార్మ్ చేశారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌కు 50 రోజుల ముందే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే వీటిలో మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ నియోజకవర్గం కూడా పెండింగ్‌లో ఉన్నది. బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అందరు అభ్యర్థులకు ఆదివారం సీఎం కేసీఆర్ బీ-ఫామ్స్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఐదు నియోజకవర్గాలకు ఇవ్వాళ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్ఫార్మ్ చేశారు. కాసేపట్లో అందరితో పాటు వీరికి కూడా బీ-ఫామ్ అందించనున్నారు. గోషామహల్, నాంపల్లి విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతున్నది.
గోషామహల్ నుంచి మర్వాడీ లేదా మరాఠీలకు టికెట్ ఇచ్చే విషయంపై పార్టీలో చర్చ జరుగుతున్నది. మార్వాడీలకు ఇస్తే నగరంలోని ఇతర నియోజకర్గాల్లో కూడా వారి ఓట్లు బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరాఠీలకు ఇచ్చినా.. మహారాష్ట్ర బార్డర్‌లో ఉండే నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే కాసేపట్లోనే ఈ రెండు సీట్లపై సస్పెన్స్ వీడనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.