ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ;
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఎల్లుండి ఢిల్లీలో సమావేశం కానున్నది. కోర్ కమిటీ సభ్యులు రేపు, ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాత్రి లేదా రేపు హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 10న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. పార్టీ వర్గాలు ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో చర్చించింది. వారి ఏ పదవులు కావాలో అడిగి తెలుసుకున్నది మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం భారీగానే పోటీ ఉన్నది. ఇప్పటికే చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వం ఒక జాబితాను హైకామండ్‌కు ఇవ్వనున్నది. వీటిని పరిశీలించి.. కోర్ కమిటీ చర్చించిన అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఈ నెల 9 రాత్రి వరకు ఆ జాబితా రావొచ్చని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.