కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం

సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతన నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు

Advertisement
Update:2024-10-12 16:07 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వచ్చారు. ఈ సందర్బంగా గ్రామస్థులు సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా దసరా పండు రోజున ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లి రావాటం ఆనవాయితీ. ఈ మధ్యాహ్నం హైదరాబాదు నుంచి కొండారెడ్డిపల్లికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. ముఖ్యమంత్రి రాకతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా గ్రామంలో రూ.72 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనం, రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య పేరిట లైబ్రరీ, రూ.45లక్షలతో బీసీ సామాజిక భవనం, రూ.45లక్షలతో చేపట్టిన వెటర్నరీ హాస్పిటల్ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యేలతో కలిసి సీఎం హెలిపాడ్ నుంచి గ్రామంలోకి బయలుదేరగా..గ్రామస్తులు గజమాలలు వేస్తూ పూల వర్షం కురిపించారు. బతుకమ్మలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, శ్రీహరి, తదితరులు నాయకులు పాల్గోన్నారు.

Tags:    
Advertisement

Similar News