ఆ మాట చెప్పడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి

తుంగతుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ అన్నారు కేసీఆర్. ఈ ప్రాంత ప్రజలు గోదావరి జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత కొట్లాడినా ఏ పార్టీ కూడా కనికరించలేదని చెప్పారు.

Advertisement
Update:2023-10-29 19:27 IST

తెలంగాణ ఇచ్చింది తామేనంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు సీఎం కేసీఆర్. ఆ మాట అనడానికి వారికి సిగ్గుండాలన్నారు. తుంగతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్... కాంగ్రెస్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే, ప్రజలంతా మద్దుతుగా పోరాడితే ఆ దెబ్బకు దిగొచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చాం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులకు సిగ్గుండాలి అన్నారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతో మందిని జైల్లో పెట్టారని, కేసుల పేరుతో వేధించారని అన్నారు.


గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేడని, ఎవరైనా మాట్లాడితే నక్సలైట్ అనే ముద్రవేసి జైలులో పెట్టే పరిస్థితి ఉండేదని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైందో ఆ రోజు నుంచే మొత్తం రాష్ట్ర పరిస్థితిని సమీక్ష చేసుకున్నామని చెప్పారు.

తుంగతుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ అన్నారు కేసీఆర్. ఈ ప్రాంత ప్రజలు గోదావరి జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత కొట్లాడినా ఏ పార్టీ కూడా కనికరించలేదని చెప్పారు. 2014కు ముందు తుంగతుర్తి పర్యటనకు వస్తే చెరువుల్లో నీళ్లే ఉండేవి కావని.. ఇప్పుడు ఏ చెరువైనా ఒక్క వాన పడితే మత్తడి దుంకే పరిస్థితి ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని గోదావరి జలాలను తెచ్చుకోగలిగాం కాబట్టే ఈ ప్రాంతానికి ఇప్పుడు జలకళ వచ్చిందన్నారు.

రైతుబంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు సీఎం కేసీఆర్. రైతుబంధు పథకాన్ని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రశంసించారని గుర్తుచేశారు. దేశంలో 70 ఏళ్లుగా స్థిరపడి ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందని చెప్పారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News