నాకు సలహాలిచ్చే వ్యక్తి మీ ఎమ్మెల్యే..

కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్న దేవుడని, ఉద్యమం జరిగేటప్పుడు తాను ఇక్కడికి వచ్చి వీరభద్ర స్వామికి మొక్కుకున్నానని, స్వామి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, బంగారు మీసాలు సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నానని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.

Advertisement
Update:2023-11-21 19:22 IST

డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈసారి గెలిస్తే ఆయన హోదా పెరుగుతుందని పరోక్షంగా మంత్రి పదవిపై హింటిచ్చారు. రెడ్యా నాయక్‌ తనతో కొట్లాడి ప్రతి తండాకు బీటీ రోడ్లు వేయించుకున్నారని, తండాల్లోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు వచ్చాయని చెప్పారు. ఆయన సీనియర్‌ నాయకుడని, మంచి తెలివితేటలున్న వ్యక్తి అని, తనకు సలహాలు ఇచ్చే నాయకుడని చెప్పారు. ఆయన్ను గెలిపిస్తే మీ నియోజకవర్గంలో పనులన్నీ చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు కేసీఆర్.


Full View

డోర్నకల్ నియోజకవర్గంలో లంబాడీలు, ఆదివాసీలు, కోయలు, గోండులు ఉన్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే 3,500 తండాలను, గోండు గూడేలను గ్రామ పంచాయతీలు చేశామని చెప్పారు సీఎం కేసీఆర్. ఒక్క డోర్నకల్ నియోకవర్గంలోనే 82 తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయని అన్నారు. వాళ్లను వాళ్లే పాలించుకుంటున్నారని వివరించారు.

మొక్కు చెల్లించుకున్నా..

కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్న దేవుడని, ఉద్యమం జరిగేటప్పుడు తాను ఇక్కడికి వచ్చి వీరభద్ర స్వామికి మొక్కుకున్నానని, స్వామి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, బంగారు మీసాలు సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నానని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. మోటర్లకు మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు రూ.25వేల కోట్లు కట్ చేశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సిగ్గులేకుండా ఇదే విషయాన్ని ఒప్పుకున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒకటి కూడా ఇవ్వలేదన్నారు. నవోదయ స్కూల్స్ కూడా కేటాయించలేదని చెప్పారు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు వెయ్యాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News