మాజీ మంత్రి నారాయణ కార్యాలయాలపై సీఐడి దాడులు

దాదాపు 40 మంది సీఐడీ సిబంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. నారాయణ సంస్థల నుండి రామకృష్ణ హౌసింగ్ సొసైటీ కి నిధులు మళ్లింపు జరిగినట్టు గుర్తించారు.

Advertisement
Update:2023-01-10 20:38 IST

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మాదాపూర్ లోని NSPIRA కార్యాలయంలో ఉదయం 10 గంటల‌ నుంచి సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

దాదాపు 40 మంది సీఐడీ సిబంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. నారాయణ సంస్థల నుండి రామకృష్ణ హౌసింగ్ సొసైటీ కి నిధులు మళ్లింపు జరిగినట్టు గుర్తించారు. రామకృష్ణ హౌసింగ్ సోసైటి నుంచి అమరావతి లో అసైన్డ్ భూములు చట్టవిరుద్దంగా కోనుగోలు చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు.

ఈ సోదాల్లో NSPIRA కంపెనీ నుంచి అధికారులు నలబై కిపైగా హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.

పలువురు నారాయ‌ణ సంస్థల ఉద్యోగులను సిఐడి అధికారులు ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News