చేనేత మిత్ర తొలిసాయం.. 32వేల కుటుంబాల్లో ఆనందం

సెప్టెంబర్-1 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 9.6 కోట్ల రూపాయల సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి రూ.100కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం.

Advertisement
Update:2023-09-02 07:50 IST

ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. నెలరోజులు తిరక్కుండానే సెప్టెంబర్-1 న తొలిసాయం వారికి అందింది. బ్యాంకు అకౌంట్లలో ఆర్థిక సాయం జమ అయింది. తెలంగాణ వ్యాప్తంగా 32వేల కుటంబాలకు లబ్ధి చేకూరింది.

నెలనెలా రూ.3వేలు

మగ్గం నేసే చేనేత కార్మికులకు నెలకు రూ.3వేలు అందించేలా ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని రూపొందించింది. గతంలో చిలప నూలు, రంగులు, రసాయనాల కొనుగోళ్లలో 50శాతం రాయితీ అందించేది ప్రభుత్వం. అయితే నేరుగా వారికి లబ్ధి చేకూర్చేలా ఇప్పుడు ఆర్థిక సాయం మొదలు పెట్టింది. సెప్టెంబర్-1నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 9.6 కోట్ల రూపాయల సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి రూ.100కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం.

ఏపీలో ఎంత..?

ఏపీలో కూడా చేనేతలను ఆదుకునే పథకం ఉంది. నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి 24వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందిస్తోంది. అంటే నెలకు 2వేల రూపాయలు. తెలంగాణలో మరింత ఎక్కువ సాయం (నెలకు రూ.3వేలు) అందజేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతే కాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికుల కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించింది. రూ.25 వేల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా అందజేస్తోంది. 


Tags:    
Advertisement

Similar News