తెలంగాణలో ఎన్నికల అధికారుల నియామకం
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్.. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు.
Advertisement
తెలంగాణలో ఎన్నికల అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్.. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు.. వీరంతా ఈఆర్వోలుగా వ్యవహరించనున్నట్టు ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది.
Advertisement