ఆటోడ్రైవర్ల కోసం బీఆర్ఎస్‌.. ఏం చేయనుందంటే..!

సమస్యలపై అధ్యయం చేసి.. వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాల్ని తెలుసుకునేందుకు పార్టీ కార్మిక విభాగం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.

Advertisement
Update:2023-12-23 10:45 IST

మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో.. ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆటోడ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్‌ ముందుకు వచ్చింది. సమస్యలపై అధ్యయం చేసి.. వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాల్ని తెలుసుకునేందుకు పార్టీ కార్మిక విభాగం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.

ఈ కమిటీలో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు ఉంటారని.. వీరు ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై ఆలోచిస్తారని కేటీఆర్ చెప్పారు. ఆటోడ్రైవర్లతో పాటు ఉబర్, ర్యాపిడో, ట్యాక్సీ డ్రైవర్లతోనూ మాట్లాడి.. ఓ నివేదికను తయారు చేసి పార్టీకి అందజేస్తారన్నారు. కార్మిక విభాగం అందించే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తామని.. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు కేటీఆర్.


కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లపై ఎఫెక్ట్ పడింది. చాలా చోట్ల ఆటో కార్మికులు నిరసన తెలియజేశారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News