రేపు బీజేపీ థర్డ్ లిస్ట్.. మునుగోడు నుంచి చలమల్ల..?
బీఆర్ఎస్, కాంగ్రెస్ సీట్లు దాదాపు ఫైనల్ కావడంతో ఆ పార్టీల్లో అవకాశం దక్కని నేతలు కొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో 53 మందిని ప్రకటించిన కమలనాథులు.. మూడో లిస్టు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ లిస్టులో దాదాపు 40 స్థానాలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో సీట్లపై బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే GHMC పరిధిలోని అభ్యర్థుల ఎంపిక విషయంలో.. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
ఇక థర్డ్‌లిస్ట్‌లో గ్రేటర్ పరిధిలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి ఈ జాబితాలో చోటిస్తారని సమాచారం. ఆమె అంబర్‌పేట లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డిని బరిలో ఉండనున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ సీట్లు దాదాపు ఫైనల్ కావడంతో ఆ పార్టీల్లో అవకాశం దక్కని నేతలు కొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. చివరి నిమిషంలో హ్యాండిచ్చిన రాజగోపాల్‌కు మునుగోడులో షాకివ్వాలని బీజేపీ భావిస్తోంది. చలమల్లకు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.