బీజేపీకి వరుస షాక్ లు.. బీఆర్ఎస్ లోకి చేరికలు

ఎన్నికల వేళ.. అత్యథికంగా నాయకులను కోల్పోతున్న పార్టీగా బీజేపీ రికార్డు సృష్టిస్తోంది. కీలక నేతలు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లారు, మరికొందరు బీఆర్ఎస్ వైపు వచ్చారు. ఈ చేరికలు ఇంకా ఆగకపోవడమే ఇప్పుడు విశేషం.

Advertisement
Update:2023-11-10 18:04 IST

బీజేపీకి వరుస షాక్ లు.. బీఆర్ఎస్ లోకి చేరికలు

తెలంగాణలో ఎన్నికల సీజన్ మొదలవగానే చేరికలు కూడా జోరందుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తయినా కూడా ఇంకా చేరికలు ఆగలేదు. సర్వేలన్నీ అధికార బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండటంతో.. ఎన్నికల ముందే గులాబిదండులోకి చేరికలు పెరిగాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబి కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.


ఎన్నికల వేళ.. అత్యథికంగా నాయకులను కోల్పోతున్న పార్టీగా బీజేపీ రికార్డు సృష్టిస్తోంది. కీలక నేతలు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లారు, మరికొందరు బీఆర్ఎస్ వైపు వచ్చారు. ఈ చేరికలు ఇంకా ఆగకపోవడమే ఇప్పుడు విశేషం. నామినేషన్ల పర్వం ముగిసే సమయంలో కూడా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంటి పెద్ద స్థాయి నేతలే పక్క చూపులు చూస్తున్నారంటే బీజేపీ పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. నందు జనార్దన్ రెడ్డితోపాటు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ లో చేరిన నాయకులందరికీ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్. అందరినీ సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటారని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ చేరికలు తమ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News