బీఆర్ఎస్‌కు షాక్.. 20 మంది కౌన్సిలర్లు జంప్

20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement
Update:2024-02-14 20:33 IST

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో గులాబీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు రాష్ట్ర స్థాయి నేతలు బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పగా.. మరికొందరు సైతం జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. నిన్నటి వరకు స్టేట్ లీడర్స్ గులాబీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ శ్రేణులు పార్టీని వీడుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ తగిలింది. 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు కౌన్సిలర్లు. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌, బీఆర్ఎస్ నేత కాపు సీతాలక్ష్మిపై గతంలో అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని అసమ్మతి కౌన్సిలర్లు కోరారు.

ఈనెల 19న కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారే 20 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడం కొత్తగూడెం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News