Bandi Sanjay Arrest: అర్దరాత్రి బండి సంజయ్ అరెస్ట్!
Bandi Sanjay Arrest: వరంగల్ లో పదవతరగతికి చెందిన హిందీ ప్రశ్నా పత్రాన్ని వైరల్ చేసిన మాజీ జర్నలిస్టు, బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు బండి సంజయ్ ని అరెస్టు చేశారు.
Bandi Sanjay Arrest
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో హిందీ ప్రశ్నా పత్రంలీకైన కేసులో పోలీసులు ఆయనను కరీంనగర్ లోని ఆయన ఇంటివద్ద అరెస్టు చేశారు.
వరంగల్ లో పదవతరగతికి చెందిన హిందీ ప్రశ్నా పత్రాన్ని వైరల్ చేసిన మాజీ జర్నలిస్టు బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు బండి సంజయ్ ని అరెస్టు చేశారు. ప్రశాంత్ బండి సంజయ్ కి ప్రశ్నాపత్రం వాట్సప్ లో షేర్ చేయడమే కాక అనేక సార్లు వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నట్టు సమాచారం. విద్యార్థులు, తల్లితండ్రుల్లో గందరగోళం నెలకొల్పడానికే ప్రశాంత్ అనేక మందికి ప్రశ్నా పత్రం షేర్ చేయడమే కాక అసత్యాలు కూడా ప్రచారం చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ లో ఆయన ఇంటి వద్ద బండి సంజయ్ ని అరెస్టు చేయడానికి వెళ్ళిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు, సంజయ్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు ఎట్టకేలకు పోలీసులు సంజయ్ ని అరెస్టు చేసి తీసుకెళ్ళారు.