ఎన్టీయార్‌ని చూసి కాదు.. కేసీఆర్‌ని చూసి
తెలంగాణలో బీఆర్ఎస్‌కు వచ్చే ఓట్లన్నీ కేసీఆర్‌ను చూసే వస్తాయి కానీ ఎన్టీయార్ జపం వల్ల కాదు. ఇంత చిన్న లాజిక్ కూడా బాలయ్యకు తెలీకపోవటమే విచిత్రంగా ఉంది. పోయిన ఎన్నికల్లో ఎన్టీయార్ జపం చేసిన తెలుగుదేశం పార్టీకే జనాలు ఓట్లేయలేదన్న విషయాన్ని బాలకృష్ణ మరచిపోయారేమో.
చంద్రబాబు నాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ ఎన్టీయార్ జపం చేస్తోందన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయిన ఇన్నిరోజులకు తెలంగాణ మంత్రులు స్పందించటంలో ఉద్దేశం ఓట్ల రాజకీయమే అని బాలయ్య తేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసమే తన తండ్రి జపం చేస్తున్నారు కానీ లేకపోతే ఎన్టీయార్ గురించి వీళ్ళెందుకు మాట్లాడుతారని బాలయ్య ఎదురు ప్రశ్నించారు.
ఇక్కడే బాలయ్య వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉంది. ఎలాగంటే ఇప్పటి తరానికి ఎన్టీయార్ అంటే ఎవరో కూడా తెలియదు. ఇప్పటివాళ్ళకు ఎన్టీయార్ అంటే జూనియర్ ఎన్టీయారే. జూనియర్ ఎన్టీయార్‌కు చంద్రబాబు, లోకేష్‌తో సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అన్నారు బాలయ్య. జూనియర్ కూడా చంద్రబాబు అరెస్టయినా డోంట్ కేరన్నట్లుగానే ఉన్నారు.
ఇక ఎన్టీయార్ జపం విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్‌కు వచ్చే ఓట్లన్నీ కేసీఆర్‌ను చూసే వస్తాయి కానీ ఎన్టీయార్ జపం వల్ల కాదు. ఇంత చిన్న లాజిక్ కూడా బాలయ్యకు తెలీకపోవటమే విచిత్రంగా ఉంది. పోయిన ఎన్నికల్లో ఎన్టీయార్ జపం చేసిన తెలుగుదేశం పార్టీకే జనాలు ఓట్లేయలేదన్న విషయాన్ని బాలకృష్ణ మరచిపోయారేమో. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అరెస్టు భయానికి బావయ్య హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయిన తర్వాతే తెలంగాణలో టీడీపీ నేలమట్టమైపోయింది.
కాబట్టి బాలయ్య తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్‌కు ఓట్లు కావాలంటే ఎన్టీయార్ జపం చేయాల్సిన అవసరమే లేదని. 2014, 18 ఎన్నికల్లో ఎన్టీయార్ జపం చేస్తేనే టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు జనాలు ఓట్లేశారా? చరిత్ర తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు బాలయ్యకు. నోటికెంత వస్తే అది మాట్లాడేయటమే మొదటి నుండి అలవాటు. తెలంగాణ నుండి బావయ్య పారిపోతే తొందరలో బాలయ్య వచ్చి టీడీపీలో చైతన్యం తీసుకొస్తారట. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బాలయ్య ప్రకటించారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటు, ఎక్కడేమి మాట్లాడాలో కూడా తెలియని బాలయ్యను నమ్ముకుంటే తమ్ముళ్ళ పనిగోవిందానే.
♦