దళితులపై పోలీసులే దాడులు చేయడమా?

సీఎం గుండాలకు ఎస్కార్ట్‌ ఇచ్చి ఎమ్మెల్యే ఇంటిమీదికి దాడికి పంపిండు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-09-25 19:32 IST

వికారాబాద్‌ నియోజకవర్గంలోని మరుపల్లికి చెందిన దళితులు నవీన్‌, ప్రవీణ్‌ పై పోలీసులే దాడి చేసి కొట్టడం ఏమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో దాడి బాధితులతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసే వారిని వదిలిపెట్టబోమన్నారు. అవసరమైతే వికారాబాద్‌ కు బాధితులకు అండగా ఆందోళన చేస్తామన్నారు. ఇలాంటి చిల్లర దాడులకు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ, లీగల్‌ సెల్‌ అన్ని రకాల అందడందలు అందిస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లను కొట్టాలని ఎప్పుడూ పోలీసులను పురమాయించలేదన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి గలీజ్‌ పనులు చేయొద్దన్నారు. మనపై దాడులు చేసిన వాళ్లకు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకరగిరి మన్యాలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రే కొంతమంది గుండాలకు ఎస్కార్ట్‌ ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి మీదికి దాడికి పంపారన్నారు. వీపు చింతపండు చేసిండ్రని ముఖ్యమంత్రి మాట్లాడటం విచారకమన్నారు. ఈ నీల్గుడు నాలుగు రోజులే ఉంటుందని.. ఆ తర్వాత కాంగ్రెస్‌ లీడర్లు ఊర్లల్లో తిరిగే పరిస్థితే ఉండదన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలే వాళ్లను నిలదీస్తారన్నారు. తన నియోజకవర్గంలో దళితులపై జరిగిన దాడి ఘటనపై స్పీకర్‌ స్పందించాలని, ఎస్సైపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News