ఆరు గ్యారంటీలపై మరో కమిటీ.. ఛైర్మన్‌గా భట్టి!

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఆరు గ్యారంటీలు సహా రేషన్ కార్డుల కోసం దాదాపు కోటి 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.

Advertisement
Update:2024-01-08 17:47 IST

ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఆరు గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సబ్‌ కమిటీలో స‌భ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆరు పథకాలు లబ్ధిదారులకు అందించే బాధ్యతను ఈ కమిటీ తీసుకోనుంది.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఆరు గ్యారంటీలు సహా రేషన్ కార్డుల కోసం దాదాపు కోటి 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 లోపు డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత పథకాలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఖరారు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News