తాత కేసీఆర్‌తో కలిసి చెట్టును నాటిన హిమాన్షు
మాజీ మాంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తన తాత కేసీఆర్ తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు తన తాత కేసీఆర్‌తో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోమొక్కలు నాటాడు. తన తాత సూచనలతో తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పాడు. ఇందుకు సంబంధించిన 40 సెకన్ల వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. ఉత్తముల నుంచి నేర్చుకోవడం అని రాసుకొచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు.
మన సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు మేసేజ్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మొక్కలు నాటి హరిత సంపదను సృష్టించారు. ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనువడు హిమాన్షు రావు నడుస్తున్నాడు. తీరిక సమయంలో తన తాతయ్యతో వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షురావు గడుపుతూ.. రైతన్నలా కష్టపడుతున్నాడు. పార చేతబట్టి.. అన్నదాతల మారిపోయాడు. చెమటోడ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయాడు. మనువడు పడుతున్న కష్టాన్ని చూసి కేసీఆర్ కూడా మురిసిపోయారు