మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
Advertisement
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మంత్రి ఉత్తమ్ కు కారు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement